సీడ్స్‌తో పెప్సికో ఒప్పందం
దేశంలో సామూహిక టీకా కార్యక్రమం

హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు సస్టెయినబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకొలాజికల్ డెవలప్మెంట్ సొసైటీ (సీడ్స్) స్వచ్ఛంద సంస్థతో పెప్సికో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకొన్నది. సీడ్స్ సంస్థ దేశవ్యాప్తంగా సామూహిక టీకా కార్యక్రమాలు, ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, వైద్య సదుపాయాలతో కూడిన కొవిడ్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నది. తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నది. తొలిదశలో స్థానిక ఆరోగ్య వ్యవస్థతో కలిసి లక్ష టీకా డోసులను అందజేస్తారు. అనంతరం మూడునెలల్లో ఐదు రాష్ర్టాల్లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటుచేస్తారు. రెండోదశలో పెప్సికో పౌండేషన్ ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లకు పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, పల్స్ ఆక్సిమీటర్లు, శానిటైజర్లు అందిస్తారు. ప్రస్తుతం కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో పరిమితంగా ఉన్న వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం కృషిచేస్తామని సీడ్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ మను గుప్తా తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- covid control
- Covid-19
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

