సీఎంఆర్ గడువు పొడిగింపు..రాష్ట్రానికి రూ. 180 కోట్ల లబ్ధి : మంత్రి గంగుల
Minister Gangula| ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎంఆర్ గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎంఆర్ గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు ఈ నవంబర్ 30 వరకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గడువును పెంచిందని మంత్రి పేర్కొన్నారు. నిరంతరం రాష్ట్ర రైతాంగం గురించి తపించే ప్రభుత్వ యంత్రాంగం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటుందన్నారు.అందుకు నిదర్శనంగా రైతుకు అనుకూల నిర్ణయాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు.
దీంతోపాటు గత యాసంగి బియ్యం బాయిల్డ్ గా తీసుకునేందుకు మరో నాలుగు లక్షల టన్నులకు అనుమతించిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఎనిమిది లక్షలు టన్నులతో కలిసి మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు మార్గం సుగమమైందన్నారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CMR
- Extend
- FCI
- Minister Gangula
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

