Liquor Shop License | లక్ష దాటిన మద్యం దుకాణాల దరఖాస్తులు.. అత్యధికంగా అక్కడే 8 వేలకుపైగా అప్లికేషన్లు
Liquor Shop License | రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్‌లో ముగియనున్నది. ఈ క్రమంలో మూడునెలల ముందుగానే ప్రభుత్వం 2023-25 కాలపరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది.
Liquor Shop License | రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్‌లో ముగియనున్నది. ఈ క్రమంలో మూడునెలల ముందుగానే ప్రభుత్వం 2023-25 కాలపరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. అయితే, ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకునేందుకు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు లక్ష దాటాయి.
అత్యధికంగా శంషాబాద్, సరూర్‌నగర్‌లో 8వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6వేలకుపైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేందుకు ఈ నెల 3న ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సులు నవంబర్ 30వ తేదీతో ముగియనున్నారు. కొత్తగా జారీ చేయనున్న లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
పాత విధానం ద్వారా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సులను ఎక్సైజ్‌శాఖ జారీ చేయనున్నది. ఇక మద్యం దుకాణాల్లో ప్రభుత్వం గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించగా.. ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు మరో ఐదుశాతం రిజర్వేషన్లు ఇచ్చింది. రాష్టవ్యాప్తంగా గీత కార్మికులకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించనుండగా.. మిగతా 1,864 మద్యం దుకాణాలు జనరల్ కేటగిరి కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

