వలపోతలను వదిలి వడపోతలపైనే దృష్టి
రైతు రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎకువ దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎకువ దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాటగా చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఎక్స్‌వేదికగా మండిపడ్డారు. డిసెంబర్ 12, 2018 కంటే ముందున్న రుణాలకు రైతు రుణమాఫీ వర్తించదనే నిబంధన అసమంజసమని పేర్కొన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే కనిపిస్తున్నదని విమర్శించారు. ఆహార భద్రతకార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

