ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న సర్కార్
ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమే సర్కార్ పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాట్లాడు తూ.. ఎంజీఎం దవాఖాన సందర్శనకు వెళ్లిన దాస్యం వినయ్‌భాస్కర్‌ను గేటు వద్దే పోలీసులు అడ్డుకొని దాడి చేయడాన్ని ఖండించారు.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
దేవరుప్పుల, సెప్టెంబర్ 22 : ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమే సర్కార్ పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాట్లాడు తూ.. ఎంజీఎం దవాఖాన సందర్శనకు వెళ్లిన దాస్యం వినయ్‌భాస్కర్‌ను గేటు వద్దే పోలీసులు అడ్డుకొని దాడి చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులతో పాలన సాగిస్తున్నారని, రౌడీయిజం సాగిస్తున్న పోలీసుల లెక్క తేల్చుతామన్నారు. మొన్న అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై మగ పోలీసులు కీచకపర్వం కొనసాగించారని, వారి గొంతునొక్కి వెనక్కి నెట్టారని, ఇది పోలీసుల అరాచకానికి పరాకాష్టగా నిలిచిందని నిప్పులుచెరిగారు. ఈ ఘటనపై క్షమాపణ చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
దాస్యంపై పోలీసుల దాడి హేయం
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : వినయ్భాసర్ను ఎంజీఎం హాస్పిటల్ లోపలికి వెళ్లకుండా అడ్డుకొని, పోలీసుల దాడి చేయడం హేయమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ప్రజాప్రతినిధి దాస్యం వినయ్భాసర్పై వరంగల్‌లో పోలీసులు అత్యంత పాశవికంగా భౌతిక దాడికి పాల్పడటం గర్హనీయమని మండిపడ్డారు. రోగుల బా ధలను తెలుసుకునేందుకు వెళ్లారే తప్ప ఎలాంటి దండయాత్రకు వెళ్లలేదని స్పష్టంచేశారు. కనీసం కార్యకర్తలు కూడా పెద్దగా వెంటలేకున్నా, ఉద్దేశపూర్వకంగా పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడి వెనుక ఏ రాజకీయ నేతల హస్తం ఉందో నిగ్గు తేల్చాలని, దాడికి పాల్పడిన పోలీసులపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

