భారీగా పెరిగిన బెడ్స్.. సరిపడా మందుల నిల్వలు : మంత్రి కేటీఆర్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్‌ను భారీగా పెంచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెరిగిన పడకలు రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా రెమ్‌డెసివిర్ లాంటి మందుల నిల్వలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇంజెక్షన్లు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు రోగులు సీరియస్‌గా అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్ వంటి మరిన్ని మందుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. దీనికి అవసరమైన మందులను ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్లు, మందుల సేకరణ, సరఫరాను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశం మంత్ర కేటీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. సీఎస్ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, వికాస్ రాజ్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, సీఎం స్పెషల్ సెక్రటరీ రాజేశేఖర్ రెడ్డి, లైఫ్‌సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ భేటీలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఇసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదన్నారు. ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఇంటింటికి సర్వే చేస్తూ అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయిందన్నారు. ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ అందజేసినట్లు వెల్లడించారు. ఇది ఇన్ పేషేంట్ విజిట్స్‌కు అదనమన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వల్ల వేలాది మందిని కరోనా మహమ్మారి నుండి కాపాడగలుగుతున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కొవిడ్ హెల్ప్‌లైన్ నెంబరు..
కొవిడ్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. ఆక్సిజన్ సరఫరాపై చర్చించామన్నారు. డిమాండ్- సప్లై పైన వివరాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ ఆడిట్ ప్రభుత్వం చేస్తుందన్నారు. జిల్లాలో కొవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. మంత్రులు చేస్తున్న పర్యవేక్షణ చర్యలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించడం జరిగిందన్నారు.
10 లక్షల జనాభాకి వ్యాక్సినేషన్ పూర్తి..
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలుగా ఉంది. ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. వీరిలో 7.15 లక్షల మందితో పాటు 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారు. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వాక్సిన్ తీసుకున్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మెరుగైన పరిస్థితి..
రానున్న రోజుల్లో కరోనా చికిత్సకు అవసరమైన మందుల తయారీదారులతో పాటు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశమౌతాం. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇతర రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో మెరుగైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించి ప్రశంసించింది. కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు చర్యలను ముమ్మరం చేస్తూ మరింత సమగ్రంగా కార్యాచరణ తీసుకుని ముందుకు పోతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

