టీ శాట్.. ఇంగ్లీష్ మీడియంలోనూ గ్రూప్-1 క్లాసులు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే గ్రూప్ -1 పోటీ పరీక్షలకు టీ శాట్ నెట్వర్క్ ఇంగ్లీష్ మీడియంలోనూ పాఠ్యాంశాలను సిద్ధం చేసింది. జులై 2 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి రోజు గంట పాటు ప్రత్యేక ప్రసారాలు చేయాలని టీ శాట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా టీ శాట్ సీఈవో శైలేష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా భర్తీ చేస్తున్న గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ భాషలో సుమారు 60 గంటల నిడివి గల క్లాసులను ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 1వ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు టీ శాట్ విద్య ఛానల్లో అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశాలు ప్రసారమౌతాయని, ఇవే పాఠ్యాంశాలు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు నిపుణ ఛానల్ లో పున: ప్రసారమౌతాయన్నారు. గ్రూప్-1 ఉద్యోగార్థుల కోసం ఇప్పటికే తెలుగు మాధ్యమంలో టీ శాట్ ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి గత నెల రోజులుగా అరగంట నిడివి గల సుమారు 200 పాఠ్యాంశాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రసారాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం జూలై 1వ తేదీన శుక్రవారం ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు గంట పాటు పాఠ్యాంశ నిపుణులు లైవ్ లో పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. ఎకనామి, జాగ్రఫి, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలపై నిపుణులచే నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సీఈవో సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

