ఆపత్కాల సాయాన్ని విడుదల చేయాలి

మంత్రి హరీశ్‌రావుకు ట్రస్మా నేతల వినతి
జమ్మికుంట, ఆగస్టు 7: ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన ఆపతాల సాయాన్ని విడుదల చేయించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు కోరారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఎదురొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా శేఖర్‌రావు మాట్లాడుతూ.. దేశంలోనే ప్రథమంగా ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది ఎదురొంటున్న కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్.. ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతి నెలా రూ.2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ప్రత్యేక సాయంగా అందించడం గొప్ప విషయమన్నారు. అయితే జూలై నుంచి రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇంకా అందని కారణంగా ఉపాధ్యాయులు, సిబ్బంది ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్నారని, వెంటనే జూలై, ఆగస్టు కోటాను విడుదల చేయించాలని కోరారు. విద్యా సంస్థలు తిరిగి తెరుచుకునేదాకా ఈ సహాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే ఆర్థిక సాయం విడుదలయ్యేలా చూస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ట్రస్మా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోరం సంజీవరెడ్డి, సామ ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- harish rao
- Teachers
- trasma
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

