హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది. ‘కీ’తో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం, స్కాన్చేసిన 2,33,506 ఓఎమ్మార్షీట్ల (రెస్పాన్స్షీట్ల)ను వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిని ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు https://www. tspsc.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
‘కీ’పై అభ్యంతరాలుంటే జూలై 1 నుంచి 5 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో తెలియజేయాలని పేర్కొన్నది. అభ్యంతరాలను ఆంగ్లంలో మాత్రమే స్వీకరిస్తామని, వీటికి సహేతుకమైన రుజువులు కూడా జత చేయాలని కమిషన్ స్పష్టంచేసింది. అనంతరం తుది ‘కీ’ని ఖరారు చేస్తామని వెల్లడించింది. జూలైలోనే మొయిన్స్కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్రంలో 503 పోస్టుల భర్తీకి గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 11న నిర్వహించిన విషయం తెలిసిందే.