అగ్రి గోల్డ్‌పై ఈడీ కేసు
అగ్రి గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా జడ్జి ప్రేమావతి కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం-3 ప్రకారం నిందితులపై కేసు నమోదైంది.
- 4,100 కోట్ల ఆస్తుల జప్తు l 14 మంది నిందితులకు సమన్లు జారీ
- వచ్చే నెల 3 నుంచి కేసు విచారణ ప్రారంభం
నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అగ్రి గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా జడ్జి ప్రేమావతి కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం-3 ప్రకారం నిందితులపై కేసు నమోదైంది. నిందితులు అవ్వ వెంకటరామారావు, అవ్వ వెంకటశేశు అలియాస్ కుమార్, అవ్వ హేమసుందర వరప్రసాద్ అలియాస్ రాజుతోపాటు అగ్రిగోల్డ్‌కు చెందిన ఇతర అనుబంధ కంపెనీలపైనా కేసు నమోదు చేసింది.
ఈడీ తరఫున పీపీ జగన్మోహన్ కోర్టుకు వాదనలు వినిపించారు. పీపీ వాదనలను ఏకీభవించిన కోర్టు కేసు నమోదు చేసి 14 మంది నిందితులకు సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. వచ్చేనెల 3న కోర్టు విచారణను ప్రారంభించనున్నది. అగ్రి గోల్డ్‌కు చెందిన 4,100 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈడీ ఆస్తులను జప్తు చేసుకోవచ్చని ఢిల్లీ ట్రిబ్యునల్ సైతం తీర్పును వెలువరించింది. 2018లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం కోర్డు కేసు నమోదు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన 32 లక్షల మంది పేద డిపాజిటర్లను మోసగించినట్టు కేసులో పేర్కొన్నది. సుమారు 6,300 కోట్ల కుంభకోణానికి అగ్రిగోల్డ్ పాల్పడిందని పిటిషన్లో అభియోగాలు మోపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Agrigold Scam
- charge sheet
- ED
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

