హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : బీటెక్ సెకండియర్‌లో సీట్లను భర్తీ చేసే ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. రెండు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఈసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో వెబ్‌కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత జూలై 10 నుంచి 13 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 14లోగా అడ్మిషన్ల వివరాలను కాలేజీలు అప్డేట్ చేయాలి. జూలై 14న స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేస్తారు. జూలై 20లోపు స్పాట్ అడ్మిషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది.
