ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్
EC Schedule | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల జాబితా తయారీకి
హైదరాబాద్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన ప్రక్రియ శనివారం నుంచి షురూకానున్నది. ప్రస్తుత ఎమ్మెల్సీ కే జనార్ధన్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ క్రమంలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితా తయారీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.
డీనోవా పద్ధతిలో ఓటరు జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వగా.. దీని ప్రకారం గతంలో ఉన్న ఓటుహక్కుతో సంబంధం లేకుండా మళ్లీ ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఓటు హక్కు కోసం అర్హులైన ఉపాధ్యాయులు ఫారం-18 సమర్పించాల్సి ఉంటుంది. ఓటుహక్కు కోసం శనివారం నుంచి నవంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. నవంబర్ 23న ఓటరు జాబితా ముసాయిదా ప్రకటించి, డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

