ఈటల రాజేందర్‌ది అత్యాశ

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
హన్మకొండ, జూలై 18: రాజకీయాల్లో ఆశపడటం సహజమే. కానీ, ముఖ్యమంత్రి పదవిపై ఈటల రాజేందర్ అత్యాశపడ్డారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపుర్ మండల దళిత నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. రాజకీయం గా ఈటలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాలను ఈటల తన స్వార్థానికి వాడుకున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఒక మంత్రి హోదాలో ఉండీ ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడంతోపాటు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఎంతో సహనం పాటించి ఈటల చర్యలను ఓపిగ్గా భరించారని గుర్తుచేశారు. చివరికి టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే చర్యలకు ఈటల పాల్పడుతుండటంతో తదుపరి పరిణామాలు తప్పలేదని పేర్కొన్నారు. తిన్నింటి వాసాలు లెక్కించే ఈటల వంటి నాయకుల చర్యలు ఎవరూ భరించలేరని స్పష్టంచేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. కేవలం ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి ఈటల రాజేందర్ విషయంలో సరిగ్గా సరిపోతుందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

