సీఎంఆర్‌లో దసరా షాపింగ్ బొనాంజా

నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేతో కలిసి నిజాంపేట మాల్లో ప్రారంభం
ఈ నెల 10 వరకు వేడుకలు
ప్రతిరోజూ లక్కీడ్రా బహుమతులు
బంపర్ డ్రా విజేతకు కారు
దుండిగల్, అక్టోబర్ 1: హైదరాబాద్ నిజాంపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో దసరా షాపింగ్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘దసరా షాపింగ్ బొనాంజా’ పేరుతో ఈ నెల 10 వరకు జరిగే ఈ ఉత్సవాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికల అడ్వైర్టెజ్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్ సురేందర్‌రావు, నిజాంపేట సీఎంఆర్ షాపింగ్‌మాల్ మేనేజర్ దినేశ్ కల్వాని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రీఢం హెల్త్ కుకింగ్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్ మాల్ టైటిల్ స్పాన్సర్లుగా.. సెలెక్ట్ మొబైల్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్, నీలోఫర్ మెయిన్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ వేడుకల సందర్భంగా ఎంపిక చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్స్‌లో రూ.1,000 కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు జరిపే వారిలో ప్రతి రోజూ ఐదుగురి చొప్పున పది రోజులపాటు లక్కీడ్రా ద్వారా 32 అంగుళాల కలర్‌టీవీ, మొబైల్‌ఫోన్, గిఫ్ట్ ఓచర్లు బహుమతిగా ఇవ్వనున్నట్టు సురేందర్‌రావు వివరించారు. లక్కీడ్రా విజేతల వివరాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల్లో వెల్లడిస్తామని చెప్పారు. 11వ రోజున బంపర్ డ్రా విజేతకు కారును బహూకరించనున్నట్టు తెలిపారు. నిజాంపేటలో ఇటీవలే ప్రారంభించిన సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని మేనేజర్ దినేశ్ కల్వాని వెల్లడించారు. తమను ఆదరిస్తున్న కష్టమర్లకు, దసరా షాపింగ్ బొనాంజాతో ప్రొత్సహిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ-న్యూస్ యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల అడ్వైర్టెజ్‌మెంట్ విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు రాజిరెడ్డి, రాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

