ములుగు జిల్లాలో మందు పాతర నిర్వీర్యం
ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని వీరభద్రాపురం గ్రామ అటవీ సమీపంలో సాధారణ పౌరులు తిరిగే ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన నాలుగు మందుపాతరలను గుర్తించినట్టు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ తెలిపారు.
ములుగు, జూన్ 9 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని వీరభద్రాపురం గ్రామ అటవీ సమీపంలో సాధారణ పౌరులు తిరిగే ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన నాలుగు మందుపాతరలను గుర్తించినట్టు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ తెలిపారు. అందులో మూడు మందు పాతరలు పేలడంతో ఒక ముళ్లపంది, కొండెంగతోపాటు మరో పెంపుడు కుక్క చనిపోయిందని, వాటి కళేబరాలను గుర్తించినట్టు చెప్పారు. అదే ప్రాంతంలో అమర్చిన మరో మందు పాతరను బీడీ టీమ్ పోలీసులు నిర్వీర్యం చేసినట్టు పేర్కొన్నారు. మావోయిస్టులు మందుపాతర్లను అమర్చడం ద్వారా అమాయక ప్రజల ప్రాణాలతోపాటు వన్య ప్రాణులు, పెంపుడు జంతువులు బలవుతున్నాయని తెలిపారు. ఎవరికి ఎలాంటి హానీ జరగకుండా మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లో అమర్చిన మందు పాతర్లను వెంటనే తొలగించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

