సికింద్రాబాద్ స్టేషన్లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం.. కాసేపట్లో రైళ్ల పునరుద్ధరణ : డీఆర్ఎం గుప్తా
హైదరాబాద్ : ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుప్తా స్పష్టం చేశారు. ఐదు రైలింజన్లకు నిప్పు పెట్టడంతో పాటు 30 బోగీలను ఆందోళనకారులు ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. స్టేషన్‌లోని పార్సిల్ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో 18 ఎక్స్‌ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లు, 65 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశామన్నారు. ఇవికాక 15 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం జరిగిందని తెలిపారు. 8 రైళ్లను డైవర్ట్ చేశాం. ఒక రైలును రీషెడ్యూల్ చేశామని చెప్పారు. మరికాసేపట్లోనే రైళ్ల సేవలను పునరుద్ధరిస్తామని డీఆర్ఎం గుప్తా స్పష్టం చేశారు. రైళ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు.
ప్లాట్ ఫాం నంబర్ 2 నుంచి 7 వరకు ధ్వంసం
రైలు కోచ్‌లకు అధికంగా డ్యామేజ్ జరిగిందని, ఆ తర్వాత ప్లాట్‌ఫాంలపై ఉండే స్టాల్స్, వాటర్ కూలర్స్ వంటి వస్తువులను చాలా వరకు ధ్వంసం చేశారని గుప్తా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్లాట్ ఫాం నెంబర్ 2 నుంచి 7 వరకు ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. దీని వల్ల ఎంత నష్టం జరిగింది అనే అంచనా కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుతానికి సిగ్నలింగ్, ట్రాక్‌లు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లకు ఎలాంటి నష్టం జరగలేదు. రైలు ట్రాక్‌కు ఏమైనా జరిగిందేమో చెక్ చేస్తే రైలు సేవలు ప్రారంభించడానికి వీలవుతుంది. అన్నీ సరిగ్గా ఉంటే ఒక గంటలో రైలు సేవలు ప్రారంభిస్తామని గుప్తా పేర్కొన్నారు.
ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదు..
కనీసం నాలుగు రైలు బోగీలను తగలబెట్టేశారు. అలాగే 30 పైగా బోగీల అద్దాలు పగలగొట్టేశారు. కొన్ని సీట్లను ధ్వంసం చేశారు. 8 రైలు ఇంజిన్లలో కూడా డ్యామేజ్ జరిగింది. ఎస్కిలేటర్, లైట్లు, ఫ్యాన్లు కూడా చాలా వరకు ధ్వంసం అయ్యాయి. మొత్తం రూ. 6 నుంచి 7 కోట్ల నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. పార్శిల్స్‌లో కూడా రెండింటిని నాశనం చేశారు. వాటిలో ఉన్న వస్తువుల విలువ ఏంటో కచ్చితంగా చెప్పలేం. పార్శిల్స్‌లో ఉన్న చేపలు, గుడ్లు వంటి పదార్థాలు డ్యామేజ్ అయ్యాయి. అయితే ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులతోపాటు మేమంతా ఇక్కడే ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాం. ఇప్పటి వరకు ఇంత హింసాత్మక ఘటనలు ఇక్కడ జరగడం చూడలేదు. అందుకే దాదాపు వేల మంది రైల్వే స్టేషన్లోకి వచ్చి ఇలా చేయడంతో షాకైపోయామని డీఆర్ఎం గుప్తా పేర్కొన్నారు.
ఆ పవర్ కారుకు మంటలు అంటుకుని ఉంటే ఘోరం జరిగేది..
ఆందోళనకారులు ఒక ఇంజిన్‌కు నిప్పు పెట్టినట్లు మేం గమనించాం. దాని పక్కనే ఒక పవర్ కార్ ఉంది. దానిలో 2 వేల లీటర్ల డీజిల్ నింపి ఉంది. దానికి ఆ మంటలు చేరుకుంటే చాలా ఘోరం జరిగి ఉండేది. అప్పుడే పరిస్థితిని కంట్రోల్ చేయక తప్పదని భావించి, అంతా కలిసి కాల్పులపై ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఘటన తర్వాత హైదరాబాద్, వరంగల్, కాజీపేట వంటి స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని డీఆర్ఎం గుప్తా స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

