లిక్కర్ హోం డెలివరీ కావాలి.. హైదరాబాదీల అభిప్రాయమిదీ..

liquor home delivery | ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నీ ఆన్లైన్లో ఆర్డరివ్వటం.. అది ఇంటికే డెలివరీ కావటం సాధారణమైపోయింది. సాధారణ వస్తువుల మాదిరిగానే మద్యాన్ని కూడా హోం డెలివరీ చేయాలనే డిమాండ్ తాజాగా పెరుగుతున్నది. కొవిడ్ నేపథ్యంలో ఇది మరింత జోరందుకున్నది. ఇప్పటికే మేఘాలయ, పంజాబ్, పుదుచ్చేరి, న్యూఢిల్లీ, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఒడిశాలో మద్యం హోం డెలివరీ చేస్తున్నారు. మరికొన్ని రాష్ర్టాలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. మద్యం హోం డెలివరీపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు ఇంటర్నేషనల్ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్డబ్ల్యూఏఐ) ఇటీవల 8 రాష్ర్టాల్లో సర్వే నిర్వహించింది. తెలంగాణలో హైదరాబాద్తోపాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ పట్టణాల్లో 7,500 మందితో మాట్లాడి అభిప్రాయాలను సేకరించింది. అందుకు సంబంధించిన నివేదికను ‘కన్జ్యూమర్ పల్స్ ఆన్ హోం డెలివరీ ఆఫ్ లిక్కర్’ పేరిట ఇటీవల విడుదల చేసింది.
సర్వే ముఖ్యాంశాలు ఇవీ..
| అంశం | సానుకూల స్పందన (శాతం) |
| హోం డెలివరీ వల్ల మద్యం ధరల్లో పారదర్శకత వస్తుంది | 100 |
| నాణ్యమైన మద్యం లభిస్తుంది | 63 |
| ప్రస్తుత ఈ కామర్స్ యాప్ల ద్వారానే హోండెలివరీ ఉండాలి | 60 |
| కల్తీని అరికట్టవచ్చు | 37 |
| సౌలభ్యం కోసమే హోండెలివరీ | 60 |
| కొవిడ్ 19 నేపథ్యంలో భౌతికదూరం పాటించేందుకు | 40 |
| హోం డెలివరీపై రూ.50-100 చార్జీ చెల్లించేందుకు సిద్ధం | 50 |
| మద్యం విలువలో 5-10 శాతమే చార్జీ చెల్లిస్తాం | 50 |
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

