హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఇంట్రా కాలేజీ స్లైడింగ్ షెడ్యూల్ను విడుదల చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
ఈనెల 10 నుంచి 13వరకు ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14న సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఒక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి, అదే కాలేజీలో మరో బ్రాంచీలో ఆప్షన్లు ఎంచుకోవచ్చని తెలిపారు.