ఇదొక వింత రోగం.. నిర్లక్ష్యం వద్దు : మంత్రి ఈటల
మంత్రి ఈటల | కరోనా వైరస్ అనేది ఓ వింత రోగం అని.. దీని పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

కరీంనగర్ : కరోనా వైరస్ అనేది ఓ వింత రోగం అని.. దీని పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇదొక వింత రోగం. ఏం లక్షణాలున్నా వైద్యులని కలవాలి. ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితం వచ్చే వరకు ఆలస్యమైతే.. లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి తక్షణమే ట్రీట్మెంట్ తీసుకోవాలి. నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయి. వైరస్ సోకిన కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఆ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి, క్షణాల్లో ప్రాణాలను తీస్తుందన్నారు. పాజిటివ్ అని తెలిస్తే.. నిర్లక్ష్యం చేస్తున్నవారే మరణిస్తున్నారు అని ఈటల పేర్కొన్నారు.
కరీంనగర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకు సామర్థ్యం 20 కేఎల్ అని తెలిపారు. ఈ ఆక్సిజన్ ఏడు రోజుల వరకు వస్తుందన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలనే ఉద్దేశంతో.. ఇక్కడ ఆ మిషన్‌ను ఏర్పాటు చేశాం. దాంట్లో 400 టెస్టులు చేసే ఆస్కారం ఉంటుంది. ఆటోమేటిక్ మిషన్ అందుబాటులోకి వస్తే రోజుకు 1000 టెస్టులు చేసుకోవచ్చు. ప్రయివేటు ల్యాబ్‌ల మీద ఆధారపడకుండా ఈ సౌకర్యం కల్పించామన్నారు.
ఆక్సిజన్ కొరత లేదు..
రాష్ర్టంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదు అని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత తీరుతుందన్నారు. మనకు ఆక్సిజన్‌ను విశాఖ నుంచి కేటాయించలేదు. 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నామని తెలిపారు. టెస్టు కిట్ల కొరత కూడా రాష్ర్టంలో లేదన్నారు. జగిత్యాల, మహారాష్ర్టకు రాకపోకల వల్లే అక్కడ ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

