కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నల్లగొండ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టారని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్లగొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా వడ్ల కొనుగోలు తదితర అంశాలలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది.

పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను కష్టాల్లోకి నెట్టిందని మండిపడ్డారు. మాటలతో కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని, ప్రజలు ముఖ్యంగా మహిళలంతా అప్రమత్తులై మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

