గొర్రెల పంపిణీ కేసు నిందితుడి పిటిషన్ కొట్టివేత
గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయనే కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ కేసులోని నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. జస్టిస్ కే సుజన గురువారం తీర్పు వెలువరించారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయనే కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ కేసులోని నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. జస్టిస్ కే సుజన గురువారం తీర్పు వెలువరించారు. గొర్రెలు తీసుకొని వెళ్లి డబ్బు చెల్లించలేదంటూ ఏపీలోని పల్నాడు జిల్లా విర్పూర్ మండలానికి చెందిన సన్నెబోయిన ఏడుకొండలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సయ్యద్ న్యాయవాది కోరారు.
పిటిషనర్ పశుసంవర్ధకశాఖ నుంచి టెండర్లు పొంది గొర్రెలు, మేకలు వంటి వాటిని రవాణా చేసే వ్యాపారం చేస్తుంటారని, 2021- 23 మధ్యకాలంలో టెండర్ ఏదీ రాకపోవడంతో కోర్టులో కేసు వేసినందుకు అధికారులు కక్షతో తప్పుడు కేసులో ఇరికించారని చెప్పారు. దీనిపై ఏసీబీ తరఫు సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు, పోలీసుల తరఫున ఏపీపీ ఎస్ గణేశ్ ప్రతివాదన చేస్తూ, గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయనే కేసు దర్యాప్తులో ఉన్నదని, కింది కోర్టులో నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని, పిటిషన్‌ను కొట్టేయవద్దని కోరారు. వాదనల తరువాత హైకోర్టు, పిటిషనర్ పై ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలు ఉన్నందున పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తీర్పు వెలువరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొరాయించిన ఓటరు నమోదు వెబ్సైట్
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

