రేవంత్‌కు సొంతూరులోనే చేదు అనుభవం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డిండి ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి సొంతూరులోనే చేదు అనుభవం ఎదురైంది. డిండి ప్రాజెక్టు ఎత్తేసి గోకారం, ఎర్రవల్లి నిర్వాసితులను కాపాడాలని కోరుతూ ఓ యువకుడు రేవంత్‌రెడ్డి ఎదురుగా ఫ్ల్లెక్సీని ప్రదర్శించి నిరసన తెలిపిన ఘటన మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో చోటుచేసుకున్నది. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలికాప్టర్లో తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి వచ్చారు.
- ‘డిండి’ రద్దు చేయాలని ఫ్లెక్సీతో నిరసన ప్రదర్శన
కల్వకుర్తి, అక్టోబర్ 21 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డిండి ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి సొంతూరులోనే చేదు అనుభవం ఎదురైంది. డిండి ప్రాజెక్టు ఎత్తేసి గోకారం, ఎర్రవల్లి నిర్వాసితులను కాపాడాలని కోరుతూ ఓ యువకుడు రేవంత్‌రెడ్డి ఎదురుగా ఫ్ల్లెక్సీని ప్రదర్శించి నిరసన తెలిపిన ఘటన మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో చోటుచేసుకున్నది. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలికాప్టర్లో తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి వచ్చారు.
హెలిప్యాడ్ నుంచి తన ఇంటి వరకు వచ్చేందుకు టాప్‌లెస్ జీపులో ఎక్కి ర్యాలీగా వస్తున్న క్రమంలో ఓ యువకుడు ర్యాలీలో రేవంత్‌రెడ్డికి ఎదురుగా నిలబడి ఫ్లెక్సీని ప్రదర్శించారు. డిండి ప్రాజెక్టును రద్దు చేయడమే కాకుండా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని, డిండి నిర్వాసితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న క్రమంలో.. ఏకంగా ముఖ్యమంత్రి సొంతూరులో రేవంత్‌రెడ్డి ఎదురుగానే ఫ్లెక్సీని ప్రదర్శించి నిరసన తెలుపడం చర్చనీయాంశమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

