US Visa | అమెరికా వీసాకు ఇంటర్వ్యూ కష్టాలు.. సెప్టెంబర్ 2 నుంచి కొత్త రూల్స్
US Visa | అమెరికాకు విదేశీయుల రాకను నిరుత్సాహపరుస్తున్న ఆ దేశ పాలకులు అందులో భాగంగా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు.
US Visa | న్యూఢిల్లీ: అమెరికాకు విదేశీయుల రాకను నిరుత్సాహపరుస్తున్న ఆ దేశ పాలకులు అందులో భాగంగా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దీంతో అమెరికాకు విద్య, ఉపాధి కోసం వెళ్లాలనుకునేవారే కాకుండా పర్యాటకులు కూడా ప్రభావితం కానున్నారు. ఈ నిబంధనలు వచ్చే సెప్టెంబర్ 2 నుంచి అమలులోకి రానున్నాయి. నాన్ ఇమిగ్రెంట్ (వలసదారుడు కానివారు) వీసా దరఖాస్తుల కోసం అమెరికా విదేశాంగ శాఖ కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకొనేవారు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంతకుముందు 14 ఏండ్లలోపు బాలలకు, 79 ఏండ్లు దాటిన వృద్ధులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉండేది.
భారతీయులపై అధిక ప్రభావం
అమెరికా తీసుకొచ్చిన వీసా నిబంధనల్లో మార్పులు భారతీయులపైనే అధిక ప్రభావం చూపనున్నాయి. బిజినెస్/పర్యాటకులు, బాలలు, వృద్ధులు కూడా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉండటంతో కాన్సులేట్ కార్యాలయాల వద్ద వేచి ఉండే గడువు భారీగా పెరుగుతుంది. కాలేజీ అడ్మిషన్లు లేదా సెలవుల వంటి పీక్ సీజన్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు విద్యార్థుల్లో కొందరికి డ్రాప్-బాక్స్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలకు మినహాయింపు ఉండేది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

