యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న డీహెచ్ శ్రీనివాసరావు
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని డీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు ఉప ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృంద ఆశీర్వచనం చేయగా.. ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయ గోపురాలు, ప్రాకారాలు, అభివృద్ధి పనులను పరిశీలించి, హర్షం వ్యక్తం చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం తిరుమలకు ధీటుగా నిర్మాణం జరుపుకున్నదంటూ హర్షం వ్యక్తం చేశారు. నాడు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మిస్తే.. నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి నిర్మాణం చేపట్టారని కొనియాడారు.
కరోనాతో రెండేళ్లుగా ప్రపంచమంతా అతలాకుతలమైంది అని చెప్పారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని ప్రపంచం సుభిక్షంగా ఉండేలా చూడాలని లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకుందామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వైద్యరంగంలో మెరుగైన ఫలితాలను సాధించిందని, పేద వారికి కూడా మంచి వైద్యం అందిస్తున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతోనే రాష్ట్రంలో వైద్యం మెరుగుపడిందని, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక చర్యలతో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆసుపత్రులన్నీ బలోపేతమయ్యాయని, వైద్యులు చక్కగా పని చేస్తున్నారని, ఎక్కడికక్కడ కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

