సాంకేతికత, ఆవిషరణలే పోలీసింగ్‌కు దిక్సూచి!
నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ(ఏఐ), ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో విసృ్తతంగా వినియోగించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.
- యువ ఐపీఎస్‌ల వినూత్న ఆలోచనలకు అభినందనలు
- కోర్టు కేసులు, న్యాయ ప్రక్రియలపై మరింత దృష్టి పెట్టండి: డీజీపీ
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ(ఏఐ), ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో విసృ్తతంగా వినియోగించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే ముందంజలో ఉండాలంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్), ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)లను నిరంతరం అప్డేట్ చేస్తూ సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో అన్ని విభాగాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్త నేరచట్టాల (ఎన్సీఎల్) అమలు, ఈ-సాక్ష్య, ఈ-ఫోరెన్సిక్, ఐసీజేఎస్ అనుసంధానం, జాతీయస్థాయి పోర్టళ్లలో తెలంగాణ పనితీరుపై సమీక్షించారు. మెరుగుపర్చాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, న్యా య ప్రక్రియలను కచ్చితంగా పాటిస్తూ కేసుల పురోగతిని సమర్థంగా పర్యవేక్షించాలని చెప్పారు. రాష్ట్రస్థాయిలో నేర నియంత్రణకు సంబంధించిన వివిధ ప్రమాణాల అమలులో అత్యుత్తమ ప్రతి భ కనబరిచిన పోలీసు విభాగాలను డీజీ పీ అభినందించారు.
క్లస్టర్-1లో హైదరాబాద్, క్లస్టర్-2లో రామగుండం, క్లస్టర్-3లో నల్లగొండ, క్లస్టర్-4లో సూర్యాపేట ప్రథమ స్థానాల్లో నిలువడంతో ఆయా విభాగాల అధికారులను డీజీపీ సర్టిఫికెట్లతో సతరించారు. ఏఐ ఆధారిత అప్లికేషన్లు రూపొందించి పోలీసుశాఖలో అంతర్గత సామర్థ్యం, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న యువ ఐపీఎస్ అధికారులను అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

