Telangana | డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. బ్యాంక్ నుంచి రూ.8.65 కోట్లు స్వాహా
Tealangana | పనిచేస్తు న్న బ్యాంకుకే కన్నం వేసి రూ.8.65 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించారు. సీఐ ఎస్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్ ఐసీఐసీఐ బ్యాంక్ నర్సంపేట బ్రాంచ్‌లోని గోల్డ్‌లోన్ సెక్షన్లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసేవాడు.
Tealangana | నర్సంపేట, సెప్టెంబర్ 12: పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేసి రూ.8.65 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎస్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్ ఐసీఐసీఐ బ్యాంక్ నర్సంపేట బ్రాంచ్‌లోని గోల్డ్‌లోన్ సెక్షన్లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసేవాడు. గోల్డ్‌లోన్ రెన్యూవల్, ఖాతాల ముగింపును చూసేవాడు. బంగారు రుణ ఖాతా నిమిత్తం ఖాతాదారులు డబ్బులు తీసుకొస్తే కార్తీక్ ఆ డబ్బులను తీసుకుని వారి ఖాతాల్లో జమ చేయకుండా వాడుకునేవాడు.
రుణ ఖాతా క్లోజ్ చేయకుండానే బంగారు ఆభరణాలు ఖాతాదారులకు ఇచ్చేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మొత్తాన్ని ఇతనే చెల్లించి ఖాతా నడుస్తున్నట్టుగా బ్యాంకు రికార్డుల్లో చూపి ఆ డబ్బులను కార్తీక్ సొంతానికి వాడుకునేవాడు. ఇలా తీసిన రూ.8.65 కోట్లను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టాడు. ఈ తతం గం గతనెల 11న వెలుగు చూసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం కార్తీక్‌ను రిమాండ్‌కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

