విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
విశాఖపట్నంలోని కైలాసగిరి ఘాట్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు ఉండటంతో ఘటన తీవ్ర కలకలం రేపింది.
విశాఖపట్నంలోని కైలాసగిరి ఘాట్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు ఉండటంతో ఘటన తీవ్ర కలకలం రేపింది.
పిఠాపురం ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు విహారయాత్రలో భాగంగా విశాఖపట్నంలోని కైలాసగిరికి వచ్చారు. శనివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతుండగా ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైంది. కొండపై నుంచి దిగుతున్న సమయంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాద వార్త తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఘటనపై పవన్ కళ్యాణ్, మంత్రుల ఆరా
విశాఖలో విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులకు ప్రమాదం.. లోయలో పడిన స్కూల్ బస్సు
కైలాసగిరి కొండపై అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
పిఠాపురం నుంచి విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు
ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు
పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలు
ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 28, 2026
స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులు, ఉపాధ్యాయురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఘటనపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు బ్రేకులు ఎందుకు పనిచేయలేదు? ప్రమాదానికి అసలు కారణాలేంటి? అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ.. ‘బావర్చి’ కేసులో కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

