బడుగుల బిడ్డలకు రక్షణ లేదా?
చదువుకొని ప్రయోజకులు కావాల్సిన బడుగు బిడ్డలకు రాష్ట్రంలో రక్షణ లేదా? ఇద్దరు విద్యార్థినులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోదా? అని పలువురు వక్తలు నిలదీశారు.
- ఇద్దరు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోదా?
- సీఎం ఎందుకు స్పందించరు?
- చిన్నారుల ఆత్మహత్యలపై సీతక్క మాట్లాడాలి
- భవ్య, వైష్ణవి న్యాయ పోరాట కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
ఖైరతాబాద్, ఫిబ్రవరి 18: చదువుకొని ప్రయోజకులు కావాల్సిన బడుగు బిడ్డలకు రాష్ట్రంలో రక్షణ లేదా? ఇద్దరు విద్యార్థినులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోదా? అని పలువురు వక్తలు నిలదీశారు. రోడ్డుపై ఓ హోటల్‌ను నడుపుకొనే మహిళ కోసం స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇద్దరు బడుగు బిడ్డలు చనిపోతే మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భువనగిరి ఎస్సీ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్ చదివే భవ్య, వైష్ణవిపై పైశాచిక దాడి జరిగిందని, వారిది ఆత్మహత్య కాదని, ఒంటిపై గాట్లు ఉన్నాయని, ఇది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో భవ్య, వైష్ణవి న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు మహిళా, ప్రజా, బహుజన సంఘాల నేతలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూపరాణి, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మిదేవి మాట్లాడుతూ.. గతంలో ఉన్నత వర్గాల చెందిన ఓ యువతి చనిపోతే నలుగురు అమాయకులను కాల్చి చంపారని గుర్తుచేశారు. కానీ, బడుగు, బలహీనవర్గాల ఆడపిల్లలు చనిపోతే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిందితులను సామాజికవర్గం ఆధారంగా కాపాడుతున్నారని ఆరోపించారు. బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు కే యాదవ్ మాట్లాడుతూ.. భవ్య, వైష్ణవి ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్న గదికి మహిళా, ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిజనిర్ధారణ కమిటీగా వెళ్లి పరిశీలించామని, అధికారులు చెప్పేదానికి అక్కడ ఉన్న పరిస్థితులకు పొంత లేదని పేర్కొన్నారు. హాస్టల్ వార్డెన్ మందలించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని కట్టుకథ చెప్తున్నారని, ఎవరైనా మందలిస్తే ఒకే సారి ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారా? అని ప్రశ్నించారు.
ఆ కుటుంబానికి కనీసం ధైర్యం కల్పించారా?
రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం నాయకులు మధుయాదవ్ మండిపడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు చనిపోయి 15 రోజులు గడుస్తున్నా సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, కనీసం ఆ కుటుంబానికి ధైర్యం కల్పించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తెలంగాణ బీసీ జనసభ నేత, అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లల మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. భవ్య తండ్రి కృష్ణ మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్ తరచూ అమ్మాయి గదుల్లోకి వస్తున్నాడని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు చెప్పిందని గుర్తు చేశారు. వైష్ణవి తండ్రి నాగరాజు మాట్లాడుతూ.. తన బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీఎస్ కన్వీనర్ రాంబాబు, తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దార మధు, తెలంగాణ జర్నలిస్టు ఫోరం ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, చామకూర రాజు, డీకే చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

