Gurukula Recruitment | డిసెండింగ్ ఆర్డర్లో గురుకుల పోస్టుల భర్తీకి డిమాండ్..! అసలు ఆ విధానం ఏంటి..?
Gurukula Recruitment | తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. మొత్తం 9,120 పోస్టులను డిసెండింగ్ ఆర్డర్( Descending order) లో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల బాధలను ఆలకించాలని వారు మొరపెట్టుకుంటున్నారు. సీఎం ఇంటి వద్ద నిరసనకు అనుమతి ఇవ్వకపోవడంతో గురుకుల అభ్యర్థులు పెద్దమ్మ గుడి వద్ద భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
Gurukula Recruitment | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే చేపట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల ఫలితాలను విడుదల చేసి, అర్హులైన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది. అయితే పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌తో పాటు మిగతా పోస్టుల ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది. ఇక చాలా మంది అభ్యర్థులకు మూడు నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దీంతో సదరు అభ్యర్థులు ఒక ఉద్యోగం మాత్రమే ఎంచుకోవడంతో.. మిగతావి బ్యాక్ లాగ్ కింద వెళ్లిపోయాయి. అలాంటి పోస్టులు బ్యాక్ లాగ్ కింద వెళ్లిపోకుండా, డిసెండింగ్ ఆర్డర్(Descending order)లో నియాకమాలు చేపట్టాలని గురుకుల అభ్యర్థులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల అభ్యర్థుల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు.
గత ఆరేడు నెలల నుంచి ఈ అంశంపై గురుకుల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. మొత్తం 9,120 పోస్టులను డిసెండింగ్ ఆర్డర్( Descending order) లో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల బాధలను ఆలకించాలని వారు మొరపెట్టుకుంటున్నారు. సీఎం ఇంటి వద్ద నిరసనకు అనుమతి ఇవ్వకపోవడంతో గురుకుల అభ్యర్థులు పెద్దమ్మ గుడి వద్ద భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
అసలు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి..?
1. గురుకుల నియామకాలలో పైస్థాయి పోస్టుల భర్తీ నుండి నుండి కిందిస్థాయి పోస్టుల భర్తీ అనగా Descending order లో నియామకాలు జరగకపోవడం వలన ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగింది.
2. పైస్థాయి నుండి కిందిస్థాయి (DL, JL, PGT, TGT) వరకు Descending order లో నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోవలెను.
3. గురుకుల నియామకాలలో Relinquishment విధానాన్ని అమలుపరచి ఒక అభ్యర్థికి ఒకే ఉద్యోగాన్ని ఇవ్వగలరు .
4. పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని డౌన్ మెరిట్ ఫాలో అవుతూ నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకు ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థులతో పాటుగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలి.
మొత్తం 9,120 పోస్టుల్లో.. పీజీటీ 1,276, టీజీటీ 4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ప్రిపేర్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది ట్రిబ్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

