సోన్, సెప్టెంబర్ 10: ఓ గృహిణిపై డెలివరీ బాయ్ లైంగికదాడికి యత్నం చేశాడు. సదరు మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మంజులాపూర్ కాలనీకి చెందిన ఓ గృహిణి మూడు రోజుల క్రితం ఇయర్‌ఫోన్స్ కోసం ఫ్లిప్‌కార్టులో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. సంబంధిత కంపెనీకి చెందిన డెలివరీ బాయ్ విఘ్నేశ్ ఇయర్‌ఫోన్స్ తీసుకొని మంగళవారం ఉదయం 11-12 గంటల మధ్య డెలివరీ చేసేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. గృహిణి భర్త ఉదయం 10 గంటలకు విధులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన ఆ డెలివరీ బాయ్.. గృహిణిపై లైంగికదాడికి యత్నించాడు. అప్రమత్తమైన ఆ మహిళ కేకలు వేసి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వెంటనే యువకుడు బైక్‌పై పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలి ఇంటికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిర్మల్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డెలివరీ బాయ్ విఘ్నేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు నిర్మల్ రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సై సాయికుమార్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ పట్టణంలో ఇటీవల జరిగిన లైంగికదాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించింది. మహిళపై లైంగికదాడి, హత్యాయత్నానికి గల కారణాలేంటో వివరించాలని కోరింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఎఫ్ఐఆర్ స్థితి, బాధితురాలి ఆరోగ్యం, కౌన్సెలింగ్, రాష్ట్ర అధికారుల ద్వారా ఆమెకు పరిహారం అందించడానికి సరైన నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.