Mahesh Bigala | డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణకు 26 ఎంపీ స్థానాలు రావొచ్చు: మహేశ్ బిగాల
Mahesh Bigala | డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ వెల్లడించిన వైఖరికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు.
Mahesh Bigala | హైదరాబాద్: డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ వెల్లడించిన వైఖరికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని అన్నారు.
డీలిమిటేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాల సంఖ్య పెంచడంతో పాటు 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించే రక్షణ ఉండటం కీలకమని మహేశ్ బిగాల అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన తెలంగాణకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలు, హక్కులపై బలంగా గళం వినిపించేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం, డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన చర్చలు, సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు తన వాదన వినిపించారని గుర్తుచేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా, న్యాయబద్ధంగా ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు పెరిగితే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఈ పరిణామాలతో కేసీఆర్ మరోసారి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ మొదటి నుంచీ మద్దతు ఇస్తోందని, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం పట్ల పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. డీలిమిటేషన్ అనేది కేవలం నియోజకవర్గాల సంఖ్య పెంపునకు సంబంధించిన అంశం కాదని.. దేశ సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల మధ్య సమానత్వం, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, భవిష్యత్ తరాల హక్కులతో ముడిపడి ఉన్న కీలక అంశమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని, దక్షిణ భారత రాష్ట్రాల గొంతుక పార్లమెంట్లో మరింత బలంగా వినిపించాలని మహేశ్ బిగాల అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణకు 26 ఎంపీ స్థానాలు రావొచ్చు: మహేశ్ బిగాల
RC17 | రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? రాంచరణ్ RC17 టీం కీ అప్డేట్
‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
Vrushakarma | ‘వృషకర్మ’ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా : నాగచైతన్య
Lakshmi Verma | బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మకు రోడ్డు ప్రమాదం.. చేతికి ఫ్రాక్చర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

