Degree Admmissions | ‘డిగ్రీ’లో 3లక్షల సీట్లు ఖాళీ.. అడ్మిషన్ల సంక్షోభంలో కాలేజీలు
Degree Admmissions | డిగ్రీ విద్యపట్ల ఆసక్తి తగ్గుతున్నదా..? మూడేండ్ల డిగ్రీ కోర్సుల పట్ల విద్యార్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఏకంగా 2.96లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Degree Admmissions | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ విద్యపట్ల ఆసక్తి తగ్గుతున్నదా..? మూడేండ్ల డిగ్రీ కోర్సుల పట్ల విద్యార్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఏకంగా 2.96లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్రంలో 929 కాలేజీల్లో 4.37 లక్షల సీట్లు ఉండగా, ఇప్పటి వరకు 1.41లక్షల సీట్లు మాత్రమే నిండాయి. దోస్త్ కౌన్సెలింగ్ ద్వారా 1.19లక్షలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో 9వేలు, నాన్దోస్త్ కాలేజీల్లో 12వేల సీట్ల చొప్పున 1.41 లక్షల సీట్లు నిండాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు అడ్మిషన్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని కాలేజీల్లో అయితే 15% సీట్లు కూడా నిండలేదు. 70కి పైగా కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయి. పరిస్థితి చూస్తుంటే ఈ సారి రెండు లక్షల సీట్లు నిండేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాళీ సీట్ల భర్తీకి దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన శుక్రవారం విడుదల చేశారు.
20 నుంచి రిజిస్ట్రేషన్
దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి మొదలవుతుంది. ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తికావడంతో విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. విద్యార్థులు ఈ నెల 26వతేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 20 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ను 27న నిర్వహిస్తారు. ఈ నెల 30న సీట్లు కేటాయిస్తారు. సీట్లు వచ్చిన వారు 30వ తేదీ నుంచి ఆగస్టు 1లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా.. ఇదే తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అడ్మిషన్ల వివరాలు
- అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య పెరుగుతున్నది. రెండేండ్ల క్రితం ఈ కాలేజీల సంఖ్య 15 మాత్రమే ఉండగా, ఇప్పుడు 36కు చేరింది. ఈ ఏడాది 36 కాలేజీల్లో 45,120సీట్లకు 27,434 సీట్లు భర్తీకాగా 17,686 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
- 26 ఎయిడెడ్ కాలేజీల్లో ఈ సారి 10,800 సీట్లకు 4,263 సీట్లు భర్తీ కాగా, 6,537 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండేండ్ల క్రితం అడ్మిషన్లు 9,648 ఉంటే, నిరుడు 8,136కు పడిపోయాయి.
- 580 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 2,48,330 సీట్లు ఉండగా ఇప్పటి వరకు 59,615 సీట్లు భర్తీ కాగా, ఏకంగా 1,88,715 సీట్లు నిండలేదు. 2.52లక్షల సీట్లు ఖాళీగా ఉంటే ప్రైవేట్ కాలేజీల్లోనే 1.88 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి.
- రెసిడెన్షియల్ గురుకులాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. 79 కాలేజీల్లో 23,834 సీట్లుంటే 9,271 సీట్లు మాత్రమే నిండగా.. 14,563 సీట్లు భర్తీకాలేదు.
- యూనివర్సిటీ కాలేజీలు 11 ఉండగా, వీటిల్లో 45,120 సీట్లకు మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత 27,434 సీట్లు భర్తీ కాగా 17,686 నిండలేదు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

