అదనపు హెచ్ఆర్ఏ కోసం అడ్డదారులు
గ్రేటర్ హైదరాబాద్‌లో వర్తించే అదనపు హెచ్ఆర్ఏ కోసం కొందరు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డిప్యుటేషన్ గడువు ముగిసినా.. మళ్లీ గ్రేటర్‌లోనే పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. ఐదేండ్ల గడువు ముగిసినా బదిలీకాకుండా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
- డిసెంబర్లోనే ముగిసిన డిగ్రీ లెక్చరర్ల డిప్యుటేషన్ గడువు
- ఈ నెల 30 వరకు ఎక్స్టెన్షన్
- జనగణన డ్యూటీల పేరిట మళ్లీ పాగాకు మెజారిటీ లెక్చరర్ల పైరవీలు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో వర్తించే అదనపు హెచ్ఆర్ఏ కోసం కొందరు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డిప్యుటేషన్ గడువు ముగిసినా.. మళ్లీ గ్రేటర్‌లోనే పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. ఐదేండ్ల గడువు ముగిసినా బదిలీకాకుండా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అదనపు హెచ్ఆర్ఏను వదులుకోవాల్సి రావడంతో కదిలేందుకు అస్సలు ఇష్టపడటంలేదు. జనగణనను ఆసరా చేసుకొని రెండేండ్లపాటు మళ్లీ గ్రేటర్‌లోనే కొనసాగేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేసేందుకు 70 మంది అధ్యాపకులను డిప్యుటేషన్‌పై తీసుకున్నారు.
జీవో-42ను జారీచేసి.. ఐదేండ్ల కాల వ్యవధి కోసం వీరిని తీసుకున్నారు. ఐదేండ్ల గడువు డిసెంబర్ 2025తో ముగిసింది. దీంతో సర్కార్ వీరి జీతాలు కూడా నిలిపివేసింది. విద్యాసంవత్సరం మధ్యలో ఉండటంతో అధికారులు చొరవ తీసుకుని ఈ 70 మందిని పాతస్థానాల్లోనే కొనసాగించాలని నిర్ణయించారు. విద్యాసంవత్సరం ముగిసే వరకు లేదా.. సాధారణ బదిలీల్లో వీరిని బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఈ నెల 30తో డిగ్రీ విద్యాసంవత్సరం ముగియనున్నది. జనగణన డ్యూటీ ల పేరిట మెజారిటీ లెక్చరర్లు మళ్లీ పాత స్థానాల్లోనే పాగావేసేందుకు ప్రయత్నిస్తునారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

