Jeevan Reddy | దీక్షా దివస్ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రం : బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి
Jeevan Reddy | నాటి ‘ దీక్షాదివస్’ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రమని, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ : నాటి ‘ దీక్షాదివస్’ ( Deeksha Divas ) తెలంగాణ సాధించిన దివ్యాస్త్రమని, నేడు ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీ లను బొంద పెట్టే బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్( BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించిన ‘దీక్షాదివస్’లో ఆయన మాట్లాడారు.
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ( KCR ) ది ఎప్పటికీ చేరిపేయలేని సంతక మన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరివల్ల కాదన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన దమ్మున్న నేత కేసీఆర్. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన యోధుడు కేసీఆర్ అని ప్రశంసించారు. కేసీఆర్ దీక్ష సూర్య చంద్రులు న్నంత వరకూ నిలిచిపోయే శుభదినమని అన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను,36 పార్టీలను ఒప్పించి, మెప్పించి రాష్ట్రం సాధించిన గొప్ప ఉద్యమ నేతని పేర్కొన్నారు.తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ చెట్టు తల్లి వేరు లాంటివారని ఎవడో వచ్చి పీకేయడానికి కేసీఆర్ మొక్కకాదని, వటావృక్షమని అన్నారు. కేసీఆర్ ను ఏదో పీకుతామని శపధాలు చేసిన వైఎస్ , చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి జెండాలు పీక్కోని పోయారు. తెలంగాణ, కేసీఆర్ ను వేర్వేరుగా చూడలేమన్నారు.
తెలంగాణలో మళ్లీ అంధకారం..
కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అదే అంధకారం వచ్చింది. చిట్టినాయుడి అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. కేసీఆర్ పదేళ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ. నేడు కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షోభ తెలంగాణ.అబద్దాల హామీలిచ్చి కాంగ్రెస్ కు ఓట్లెయాలని దండంపెట్టి నేడు అమలు చేయలేక ఆ హామీలకు పిండం పెడుతున్నాదరని విమర్శించారు.
కొడంగల్ ప్రజలే రేవంత్ రెడ్డి పై తిరగబడుతుండ్రు. గురుకులాల్లో పురుగుల భోజనం .
విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు బంద్. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల గగ్గోలు. ఉద్యమ బాటలో ఆశలు, అంగన్ వాడీలు , ప్రభుత్వ ఉద్యోగులు. నిధుల కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాట పట్టిండ్రని దుయ్యబట్టారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండకపోతే రేవంత్ సీఎం కాదు కదా చెప్రాసీ కూడా అయివుండేవాడు కాదన్నారు. ఇక్కడి బుడ్డరు ఖాన్ మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కాలేడు. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యేవారా?. అల్జీమర్ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కాగలరా? అని ప్రశ్నించారు.
వార్ వన్ సైడే ..
స్థానిక సంస్థల ఎన్నికల ’యుద్దానికి’ బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. లోకల్ ‘వార్’ వన్ సైడ్, కాంగ్రెస్, బీజేపీ పతనం డిసైడ్ అయిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అని, బీఆర్ఎస్ క్లీన్ స్వీఫ్ ఖాయమని జోస్యం చెప్పారు.రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని గ్రామాలు నినదిస్తున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా షకీల్, మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమ కారులు, యువకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

