Home
Telangana
Decade Celebrations Will Be Held In Hyderabad On June 2 At The Secretariat Premises Under The Leadership Of Cm Kcr
కాలంపై ‘దస్’కత్ ఖూబ్సూరత్ 2023 జూన్ 2 పదో అవతరణ దినోత్సవం
అమర వీరులను స్మరించుకొనేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టీర్స్ డే (అమరవీరులస్మారక దినం)’ గా జరుపుకొంటారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలి. జాతీయ జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేయాలి. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకులు పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టీర్స్ డేలో పాల్గొంటారు.
21 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు
- జూన్ 2న హైదరాబాద్‌లో దశాబ్ది ఉత్సవాలను సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తారు.
- అమర వీరులను స్మరించుకొనేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టీర్స్ డే (అమరవీరులస్మారక దినం)’ గా జరుపుకొంటారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలి. జాతీయ జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేయాలి. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకులు పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టీర్స్ డేలో పాల్గొంటారు.
- ఇరవై రోజులపాటు వరుసగా ఆయా శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించాలి.
- ఆయా శాఖలు సాధించిన ప్రగతిని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని విశ్లేషిస్తూ డాక్యుమెంటరీని రూపొందించి, సినిమా హాళ్లు, టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి.
- ‘పవర్ డే’: విద్యుత్తు శాఖకు కేటాయించిన రోజును పవర్‌డే’ గా పిలుస్తారు. ఆ రోజు విద్యుత్తుశాఖ సాధించిన విజయాల గురించి డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. రోజంతా వివిధ కార్యక్రమాలు జరుపుకుంటారు.
- వాటర్ డే: తాగునీరు, సాగునీరుకు సంబంధించి ఒకరోజును వాటర్ డే’గా నిర్వహించాలి. రాష్ట్రంలో సాగు, తాగునీరు మొత్తంగా జలాభివృద్ధి జరిగిన తీరు.. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కార్యాచరణ గురించి వివరించాలి.
- వెల్ఫేర్ డే: రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని వర్గాల సంక్షేమంపై ‘వెల్పేర్ డే’ను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దళితబంధు, 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహావిషరణ, సెక్రటేరియట్‌కు అంబేదర్ పేరు పెట్టడం దగ్గరనుంచి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మీడియా వేదికల ద్వారా వివరించాలి.
- అగ్రికల్చర్ డే, పల్లె, పట్టణాభివృద్ధి దినం, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డే, రెవెన్యూ డే, పరిపాలనా సంసరణలు, పోలీసు సంసరణలు తెలిపేలా ప్రత్యేక రోజు, మహిళా సాధికారతను తెలిపేలా ఉమెన్ డే, ఇండస్ట్రీస్ ఐటీ డే, ఎడ్యుకేషన్ డే, మెడికల్ అండ్ హెల్త్ డే, ఆర్టిజన్స్ డే (వృత్తిపనులు), గ్రీన్ డే, హ్యాండ్లూమ్ డే.. ఇట్లా ఒకో శాఖకు ఒకోరోజును కేటాయించి ప్రగతి ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తారు.
- ఉద్యమ డాక్యుమెంటరీ: తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన పోరాటాల చరిత్రను తెలిపేలా డాక్యుమెంటరీ రూపొందించాలి.
- 2 జూన్ 2014 నుంచి 2023 జూన్ 2 దాకా స్వయంపాలనలో సాగిన సుపరిపాలన, అది సాధించిన ప్రగతిని డాక్యుమెంటరీగా రూపొందించాలి.
- ఉత్సవాల సందర్భంగా పిండి వంటలు, ఆట పాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద తదితర కళాకారులతో ప్రదర్శనలు సాంసృతక కార్యక్రమాలు నిర్వహించాలి.
- గోలొండ కోట, వరంగల్ కోట, భువనగిరి కోట వంటి చారిత్రక కట్టడాలను, రామప్ప సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సుందరంగా అలంకరించాలి.
- హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శనలు ఏర్పాటుచేయాలి.
- విధుల్లో ప్రతిభ కనబరిచిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి అవార్డులు అందజేయాలి.
- రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఐదారు వేల మంది కళాకారులతో హైదరాబాద్‌లో సాంసృతిక కార్యక్రమాలు ధూం ధాం ర్యాలీ నిర్వహించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

