హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్, నీరా ప్రాసెసింగ్ యూనిట్, 7 కమర్షియల్ షాపులు, బ్యాంకెట్ హాల్ లీజు టెండర్ల గడువును పొడిగించినట్టు తెలంగాణ గౌడ సహకార ఆర్థిక సంస్థ (టీజీటీటీఎఫ్సీ) ఎండీ డీఆర్ ఉదయ్ ప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్ణయించిన గడువును మార్చి 31 సాయంత్రం 3 గంటల వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. బిడ్లను ఏప్రిల్ 1న ఉదయం 11గంటలకు అధికారులు తెరుస్తారని తెలిపారు.