DDMS | డీడీఎంఎస్‌లో వివిధ వొకేషనల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
DDMS | దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ వొకేషనల్ సెంటర్లో పలు కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
DDMS | ఉస్మానియా యూనివర్సిటీ : దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ వొకేషనల్ సెంటర్లో పలు కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్, హెల్త్ కేర్ మల్టీపర్పస్ వర్కర్ (నర్స్ కోర్స్), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డయాలసిస్ అసిస్టెంట్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత పదవతరగతి అని వివరించారు.
రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ అసిస్టెంట్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, పర్ఫ్యుజన్ టెక్నీషియన్ వంటి పారా మెడికల్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత ఇంటర్మీడియట్ అని చెప్పారు. అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈ కోర్సుల్లో చేరేందుకు వచ్చే నెల 5వ తేదీ ఆఖరు అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 8309037134 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

