సర్కార్ చేతిలో ఈసీ తోలుబొమ్మ.. షెడ్యూల్‌కు, నోటిఫికేషన్‌కు మధ్య గడువు ఏది?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తోలుబొమ్మలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. షెడ్యూల్‌కు, నోటిఫికేషన్‌కు మధ్య ఒక రోజు కూడా గడువు ఇవ్వకుండా ఇంత హడావుడిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు.
- గవర్నర్ జోక్యం చేసుకోవాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తోలుబొమ్మలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. షెడ్యూల్‌కు, నోటిఫికేషన్‌కు మధ్య ఒక రోజు కూడా గడువు ఇవ్వకుండా ఇంత హడావుడిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉండే మేడారం జాతరను సైతం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్మరించిందని ఆవేదన వ్యక్తంచేశారు. కోట్లాది మంది భక్తులు మేడారం వెళ్లే సమయంలో ఎన్నికలు నిర్వహించడమా? ఇది ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.
బీసీలను మోసం చేసిన రేవంత్ రాజీనామా చేయాలి
- మున్సిపల్ ఎన్నికల పేరుతో బీసీలకు మళ్లీ అన్యాయం
- బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
రవీంద్రభారతి, జనవరి 28 : రాష్ట్రంలోని బీసీలను మోసగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 15 బీసీ కులసంఘాల సమావేశం, బీసీ సంక్షేమ సంఘం కో ఆర్డినేటర్ ర్యాగ అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించి రూ.3వేల కోట్ల సాకుతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలను దగా చేసిందని, కోర్టు తీర్పు బీసీలకు అనుకూలంగా వస్తుందని భావించే హడావుడిగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయించి మరోసారి బీసీలను మోసగించారని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 28శాతం ఇచ్చి బీసీ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నదని పేర్కొన్నారు. 2028లో బీసీలంతా ఏకమై కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ఆ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేయడం ఖాయమని హెచ్చరించారు. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుం డా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురిచేసిందని ధ్వజమెత్తారు. సమావేశంలో బీసీ నేతలు గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

