గడ్డెన్నవాగును పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ బృందం
ఆనకట్టల రక్షణ కోసం ప్రపంచబ్యాంకు నిధులతో ప్రతిపాదించిన డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు (డ్రిప్)లో భాగంగా వేసిన డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వరుసగా ఒక్కో ప్రాజెక్టును సందర్శిస్తున్నది.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఆనకట్టల రక్షణ కోసం ప్రపంచబ్యాంకు నిధులతో ప్రతిపాదించిన డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు (డ్రిప్)లో భాగంగా వేసిన డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వరుసగా ఒక్కో ప్రాజెక్టును సందర్శిస్తున్నది. అందులో భాగంగా చైర్మన్ గంజు అశోక్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం నిర్మల్ జిల్లా గడ్డెన్నవాగు ప్రాజెక్టును సోమవారం సందర్శించింది. డ్యామ్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? లీకేజీలు ఉన్నాయా? లేవా? తదితర అంశాలను ఈ బృందం సమగ్రంగా పరిశీలించింది. ప్రాజెక్టు గ్యాలరీ, కుడి-ఎడమ మట్టికట్టలు, 8 గేట్లతోపాటు ఓటీ స్లూయిస్‌లు, స్పిల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టును సందర్శించిన టీమ్‌లో డ్రిప్ నోడల్ అధికారి, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, డ్రిప్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం సత్యనారాయణరెడ్డి, గడ్డెన్నవాగు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి, డ్రిప్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రఘునాథశర్మ, డీఈఈ సతీశ్ తదితరులున్నారు. నేడు ఈ బృందం సాత్నాల, స్వర్ణ ప్రాజెక్టులను సందర్శించనుంది. డ్రిప్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం 29 ప్రాజెక్టులను చేర్చగా.. అందులో ఇప్పటివరకు ఆరు ప్రాజెక్టులను ఈ డ్యామ్ సేఫ్టీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

