హైదరాబాద్ విశ్వనగరం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.. పారిశ్రామిక, పర్యాటక, ఐటీ, వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం వంటి ప్రాధాన్య రంగాలకు బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా నార్సింగి వద్ద సోలార్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసింది. నానక్‌రామ్‌గూడ, కోకాపేట పరిసర ప్రాంతాల్లో నివసించే ఐటీ ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు ఇక్కడకు వచ్చి సైకిల్ తొక్కుతూ ఆనందపడుతున్నారు.