Covid Vaccination Drive : జీహెచ్ఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌పై సీఎస్ సమీక్ష
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీలో వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. 10 నుంచి 15 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ కొనసాగనుందని ఆయన తెలిపారు.
ఈ ప్రత్యేక డ్రైవ్ కోసం మొత్తం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 సంచార టీకా వాహనాలు.. కంటోన్మెంట్ పరిధిలో 25 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సోమేశ్ కుమార్ వివరించారు. జీహెచ్ఎంసీలో 4,846 కాలనీలు, బస్తీల్లో.. కంటోన్మెంట్ పరిధిలోని 360 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతామని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ కోరారు. ఇంటింటికి వెళ్లి టీకాలు వేసుకోని వారిని గుర్తించాలని సిబ్బందికి ఆయన సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

