Son stabs Father | దారుణం.. బెట్టింగ్ ఆడొద్దని చెప్పినందుకు తండ్రిని పొడిచి చంపిన 19 ఏళ్ల కుమారుడు
Son stabs Father | బెట్టింగ్ ఆడవద్దని సూచించిన తండ్రిని దారుణంగా హత్యచేసినా ఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కొడుకు కత్తితో దాడి చేసి చంపిన దారుణం గచ్చిబౌలి ప్రాంతంలో చోటు చేసుకుంది.
వనపర్తి : బెట్టింగ్కు ( Betting ) బానిసై ప్రాణాలను తీసుకోవడమే కాదు ప్రాణాలు తీస్తుందని నిరూపించాడు ఓ కుమారుడు. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం.. వనపర్తి ( Wanaparthy ) జిల్లాలోని ఘన్పూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హనుమంతు(37)కు భార్య, ఇద్దరు కొడుకులు రవీందర్(19), సంతోష్ ఉన్నారు. వీరు జీవనోపాధి కోసం గచ్చిబౌలిలోని ఎన్టీఆర్నగర్కు వలస వచ్చి జీవిస్తున్నారు.
హనుమంతు మేస్త్రీగా పని చేస్తుండగా, పెద్ద కొడుకు రవీందర్ ఇంటర్ పూర్తి చేసి జులాయిలా తిరుగుతూ, బెట్టింగ్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇటీవల అప్పులు పెరిగిపోవడం, కుమారుడి ఉన్నత విద్యకు డబ్బుల్లేక హనుమంతు సొంతూరులోని భూమి తాకట్టు పెట్టి రూ.6 లక్షలు తెచ్చాడు. ఈ డబ్బులపై కన్నేసిన రవీందర్ బ్యాంకులో వేస్తే భద్రంగా ఉంటుందని తన అకౌంట్లో రూ.2.5 లక్షలు జమ చేయించుకున్నాడు. ఈ డబ్బులను బెట్టింగ్ యాప్లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు.
అకౌంట్లో ఉన్న డబ్బులు విత్ డ్రా చేద్దామని తండ్రి అడగ్గా స్నేహితుడికి ఇచ్చానని, త్వరలోనే ఇస్తాడని నమ్మించాడు. ఈ విషయంలో, అలానే బెట్టింగ్ ఆపాలని తండ్రి హనుమంతు, కొడుకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో తండ్రిపై కక్ష పెంచుకున్నాడు.
మంగళవారం మధ్యాహ్నం తండ్రి డబ్బుల గురించి నిలదీయగా స్నేహితుడు ఇచ్చేందుకు వస్తున్నాడంటూ ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.తన స్నేహితుడు డబ్బులతో పాటు సర్ప్రైజ్ ఇస్తాడని చెప్పి తండ్రి కళ్లకు రవీందర్ గంతలు కట్టి మాటల్లో పెట్టి అప్పటికే తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

