కాంగ్రెస్‌కు కామ్రేడ్ల షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న సీపీఎం, సీపీఐ
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు అనూహ్యమైన షాక్ ఇచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మార్చిలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం పోటీచేయబోతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శుక్రవారం ప్రకటించారు. సీపీఐ సైతం ఇదే ఆలోచనలో ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఈ నెల 25న తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంపై వామపక్షాల గురి
వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానంపై వామపక్షాలు ప్రధానంగా ఆశలు పెట్టుకున్నాయి. ఈ 3 జిల్లాల్లో సీపీఎం, సీపీఐ పార్టీలకు పట్టు ఉన్నందున ఈ స్థానం నుంచి పోటీచేయాలని ఆ పార్టీ అనుబంధ సంఘాలు తమ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పీఠం కూడా సీపీఐ ఖాతాలోనే ఉండటం తమకు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. మరోవైపు తమ పట్టును నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపయోగపడుతాయని సీపీఎం భావిస్తున్నది. అందుకే వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంలో పోటీకి సిద్ధమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్‌కు కామ్రేడ్ల షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న సీపీఎం, సీపీఐ
ఈహెచ్ఎస్ ఉన్నా.. అందని నగదురహిత వైద్యం
సింథటిక్ మాంజా విక్రయిస్తే లైసెన్స్ రద్దు
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లేవి?.. నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
పాఠాలు బంద్‌పెట్టి.. ఆచార్యుల ర్యాలీ.. వీసీకి మద్దతుగా జేఎన్టీయూలో ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

