భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి!
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అండతో అదే పార్టీకి చెందిన ఆయన అనుచరులు ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జా యత్నానికి పాల్పడుతున్నారని పీపుల్స్ ట్రస్ట్ సభ్యు లు, సీపీఎం నాయకులు ఆరోపించారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ కొనుగోలు చేసిన 4 ఎకరాల విలువైన ప్రైవేట్ పట్టా భూ మిని కొందరు కబ్జా చేస్తున్నారంటూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు.
- రెవెన్యూ వివాదంలో ఉన్న స్థలంపై కన్నేసిన ఎమ్మెల్సీ అనుచరులు
- ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం
- ఎమ్మెల్సీ అండతోనే కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం: సీపీఎం నాయకులు
మేడ్చల్, అక్టోబర్13 (నమస్తే తెలంగాణ) /దుండిగల్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అండతో అదే పార్టీకి చెందిన ఆయన అనుచరులు ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జా యత్నానికి పాల్పడుతున్నారని పీపుల్స్ ట్రస్ట్ సభ్యు లు, సీపీఎం నాయకులు ఆరోపించారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ కొనుగోలు చేసిన 4 ఎకరాల విలువైన ప్రైవేట్ పట్టా భూ మిని కొందరు కబ్జా చేస్తున్నారంటూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు.
వివాదాస్పద స్థలం వద్ద రేకుల ఫెన్సింగ్‌ను తొలగించేందుకు యత్నించగా ఉద్రిక్తంగా మారింది. తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఓ వ్యక్తి, అధికార పార్టీ విప్, వెంకట్ అండదండలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ పీపుల్స్ ట్రస్ట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖబడ్దార్ బల్మూరి వెంకట్.. అంటూ సీపీఎం నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 2024లో బౌరంపేటలోని సర్వేనంబర్ 259లో 4 ఎకరాల పట్టాభూమిని ట్రస్టు కొనుగోలు చేసిందని, 2025లో అబ్దుల్ మాజిద్ తమ తాతలనాటి భూమి అంటూ పాగావేశారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇరువర్గాలు ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా, భూవివాదం తేలేవరకూ ఎవరూ ఆ స్థలంలోకి ప్రవేశించవద్దని అప్పటి ఆర్డీవో ఆదేశించారు.
ఎవరినీ అనుమతించవద్దంటూ పోలీసులకు 145 సీఆర్పీసీ ఆదేశాలు సైతం జారీచేశారు. అయితే అబ్దుల్ మాజిద్ మనుషులు గత రెండు రోజులుగా వివాదంలో ఉన్న స్థలంలోకి ప్రవేశించి, భూమిని చదును చేయిస్తున్న విషయం తెలుసుకున్న సీపీఎం నేతలు మంగళవారం సాయంత్రం ఆ స్థలం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. లోపల ఉన్న వారు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దుండిగల్ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని కాజేసేందుకు అక్రమార్కులతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేతులు కలిపారని సీపీఎం నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీసీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి సత్యం, దుండిగల్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి మండలాల కార్యదర్శులు లింగస్వామి, వెంకట్రామయ్య, కీలుకాని లక్ష్మణ్, రాజశేఖర్, ప్రగతినగర్ మాజీ సర్పంచ్ శ్రీరాములు, నేతలు నరేశ్, అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

