నక్సలైట్లను చంపగలరేమో.. నక్సలిజాన్ని చంపలేరు : సీపీఐ నారాయణ
నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.
హైదరాబాద్ : నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. నక్సలైట్లను చంపగలరేమోగానీ నక్సలిజాన్ని అంతం చేయలేరని అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవాచేశారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా పర్యటలో భాగంగా మాట్లాడిన అమిత్ షా నక్సలైట్లు తక్షణమే హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. నక్సలైట్లు గిరిజన బిడ్డలను, పోలీసులను చంపినప్పుడు వారి తరఫున ఎవరూ మాట్లాడలేదు గానీ.. ఇప్పుడు చర్చల కోసం చాలామంది పిలుపునిస్తున్నారని దుయ్యబట్టారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 వేల మంది నక్సలైట్లు లొంగిపోయారన్నారు. ఆయుధాలు వీడేదాక వారితో చర్చలు ఉండవని అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో నారాయణ స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

