CPGET 2023 | హైదరాబాద్ : తెలంగాణలోని 8 యూనివర్సిటీలతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్-2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఓయూ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి జులై 10వ తేదీ వరకు ప్రతి రోజు మూడు సెషన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను త్వరలోనే సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. తొలి సెషన్ ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు.