CPGET 2023 | హైదరాబాద్ : తెలంగాణలోని 8 యూనివర్సిటీలతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్-2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సీపీగెట్ దరఖాస్తులకు ఆదివారంతో గడువు ముగియనుంది.
ఇప్పటి వరకు సీపీగెట్‌కు 40వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. వీటిలో అత్యధికంగా ఎమ్మెస్సీ కెమిస్ట్రీకి 3,900లకు పైగా దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసినా రూ. 500 ఫైన్‌తో ఈనెల 18, రూ. 2వేల ఫైన్‌తో ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అవకాశముంది. 8 యూనివర్సిటీలతో పాటు అనుబంధ కాలేజీల్లో 77 పీజీ, ఇంటిగ్రెటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 1న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.