CP Swetha | ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి..కీలక విషయాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ శ్వేత
CP Swetha | మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy)పై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్వేత(CP Swetha) మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 30రోజున సూరంపల్లిలో కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగిందని, ప్రజల ఆగ్రహంతో ఎంపీపై కత్తితో దాడి చేసిన వ్యక్తి పై దాడి చేశారని, అతడు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.
సిద్దిపేట : మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy)పై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్వేత(CP Swetha) మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 30రోజున సూరంపల్లిలో కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగిందని, ప్రజల ఆగ్రహంతో ఎంపీపై కత్తితో దాడి చేసిన వ్యక్తి పై దాడి చేశారని, అతడు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.
ఈ కేసులో అన్నీ ఆధారాలు సేకరించాం. దాడి చేసిన వ్యక్తి పలు న్యూస్ ఛానల్స్ రిపోర్టర్‌గా పనిచేశాడు. వారం రోజుల క్రితం నిందితుడు ప్రణాళిక ప్రకారం కత్తిని కొనుగోలు చేశాడని వివరించారు. నిందుతుడిని బుధవారం కోర్టు ముందు హాజరు పరచగా జడ్జి 14రోజుల రిమాండ్ విధించారని పేర్కొన్నారు. నిందుతునికి ఎవరైనా సహకారం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి నిందుతుడు రాజు ఎవరి సహకారం తీసుకోలేదని, అతడు ఒక్కడు మాత్రమే నేరంలో పాల్గొన్నట్లు తెలిపారు. నిందుతుడు సెన్సేషన్ క్రియేట్ చేయడానికే దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీపీ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

