కొవాగ్జిన్ బూస్టర్‌డోస్
- ప్రారంభమైన ట్రయల్స్
- మొత్తం 190 మందిపై ప్రయోగాలు
- జీవితాంతం ప్రతిరక్షకాలు ఉత్పత్తి!

హైదరాబాద్, మే 05 (నమస్తే తెలంగాణ): భారత్ బయోటెక్ తన కొవాగ్జిన్ బూస్టర్‌డోస్ ప్రయోగాలను ప్రారంభించింది. ప్రస్తుతం కరోనా సోకకుండా నిరోధించేందుకు కొవాగ్జిన్ రెండు డోసులను ఇస్తున్నారు. రెండోడోస్ వేసుకున్న రెండువారాల తర్వాత శరీరంలో సంపూర్ణంగా ప్రతిరక్షకాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ప్రతిరక్షకాలు దాదాపు 9 నెలలు మానవ శరీరంలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే.. కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ పొందాలంటే ఏటా టీకాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా భారం అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ ‘బూస్టర్ డోస్’ ప్రయోగాలు చేపట్టింది. రెండోడోస్ పూర్తయ్యాక మూడోడోస్ ఇస్తే ఏర్పడే ప్రతిరక్షకాలు జీవితాంతం ఉంటాయని భారత్ బయోటెక్ భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో బూస్టర్‌డోస్ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలంటూ గతనెలలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకోగా తాజాగా అనుమతి ఇచ్చింది. దాంతో 190 మందికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఏడుగురు వాలంటీర్లకు బూస్టర్‌డోస్ ఇచ్చారు. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో ప్రయోగాలు చేపడుతున్నట్టు భారత్ బయోటెక్‌వర్గాలు తెలిపాయి. 18-55 ఏండ్ల మధ్యవారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించాయి. గతంలో ఫైజర్, మోడర్నా సైతం బూస్టర్ డోస్ ప్రయోగాలు జరిపాయి. అయితే జీవితాంతం ప్రతిరక్షాలు ఉంటాయని నిర్ధారించలేకపోయాయి. ఏటా తప్పనిసరిగా కనీసం ఒక్క డోసైనా తీసుకోవాల్సిందేనని ఈ రెండు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

