కొవాగ్జిన్ పూర్తి సురక్షితం
కొవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలు, సామర్థ్యంపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ గురువారం స్పందించింది. ‘సేఫ్టీ ఫస్ట్' (రక్షణకే తొలి ప్రాధాన్యం) అనే నినాదంతో తాము కొవాగ్జిన్‌ను తయారు చేశామని తెలిపింది.
- భారత్ బయోటెక్ వివరణ
హైదరాబాద్, మే 2(నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలు, సామర్థ్యంపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ గురువారం స్పందించింది. ‘సేఫ్టీ ఫస్ట్’ (రక్షణకే తొలి ప్రాధాన్యం) అనే నినాదంతో తాము కొవాగ్జిన్‌ను తయారు చేశామని తెలిపింది. సామర్థ్యాన్ని రెండో ప్రాధాన్య అంశంగా ఎంచుకున్నామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం’ కింద తయారై, దేశంలో అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న ఏకైక వ్యాక్సిన్ కొవాగ్జిన్ అని పేర్కొన్నది. లైసెన్స్ పొందే క్రమంలో 27 వేల పరీక్షలను ఎదుర్కొన్నట్టు చెప్పింది. వేలాది మందిపై క్లినికల్ ట్రయల్స్‌ను అత్యంత పకడ్బందీగా నిర్వహించామని, కేంద్ర వైద్యారోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షించిందని తెలిపింది. అందుకే ఇప్పటివరకు కొవాగ్జిన్‌కు సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, రక్తం గడ్డ కట్టడం, త్రాంబోసైటోపెనియా, టీటీఎస్, వీఐటీటీ, పెరికార్డియాటిక్స్ వంటివి నమోదు కాలేదని చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

